ASBL Koncept Ambience

'తానా' చైతన్యస్రవంతి వేడుకలు డిసెంబర్ 14 నుంచి 30 వరకు

'తానా' చైతన్యస్రవంతి వేడుకలు డిసెంబర్ 14 నుంచి 30 వరకు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతి రెండేళ్ళకోమారు మాతృరాష్ట్రాలలో నిర్వహించే చైతన్య స్రవంతి వేడుకలను ఈసారి కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తానా అధ్యక్షుడు జంపాల చౌదరి తెలిపారు. తెలుగు సంస్కృతీ, సాహిత్య కార్యక్రమాలతోపాటు కళారూపాలను ప్రోత్సహించేలా తమ కార్యక్రమాలు ఉంటాయని చెబుతూ, ఈ సంవత్సరం తానా జానపద కళోత్సవాలు, సాంస్కృతిక సంబరాలు, ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాలకు తోడు, తానా అగ్రికల్చరల్‌ ఫోరం వారు 'రైతు కోసం' పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎల్లలు లేని తెలుగు కార్యక్రమంలో భాగంగా దక్షిణ తమిళనాడులోని తెలుగువారిని కలవడం ఈసారి ప్రత్యేకత అని జంపాల చౌదరి చెప్పారు.

రాజమండ్రిలో జానపద కళారూప ప్రదర్శనలు, ఖమ్మంలో సాహితీ చర్చా కార్యక్రమాన్ని, కర్నూలులో తానా సేవా దినోత్సవాన్ని, అమరావతి, విశాఖపట్టణం, తిరుపతి, హైదరాబాద్‌లలో కూడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జంపాల చౌదరి వివరించారు.

కార్యక్రమ వివరాలు

డిసెంబర్‌ 14వ తేదీన కృష్ణా జిల్లాలోని కొడాలిలో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌, ఐ క్యాంప్‌, కార్డియాక్‌ క్యాంప్‌ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కో ఆర్డినేటర్‌గా శ్రీనివాస్‌ గోగినేని వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌, లయన్స్‌ ఐ హాస్పిటల్‌, మణిపాల్‌ హాస్పిటల్స్‌వారు ఈ శిబిరానికి సహకరిస్తున్నారు.

డిసెంబర్‌ 15వ తేదీన క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌ ఉంటుంది

డిసెంబర్‌ 16వ తేదీన గుంటూరు జిల్లాలోని మాచర్లలో తానా రైతు కోసం కార్యక్రమం జరుగుతుంది. డా. జానయ్య కోట దీనికి కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. పిడుగురాళ్ళలో జరిగే రైతుకోసం కార్యక్రమానికి డా. హనుమయ్య బండ్ల కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అదే రోజున కృష్ణా జిల్లాలోని గోపవరం జడ్‌పి హైస్కూల్‌ లైబ్రరీలో కంటి చికిత్సా శిబిరం, కార్డియాక్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. దీనికి శ్రీనివాస్‌ గోగినేని కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. బ్రెడ్‌ సొసైటీ, లయన్స్‌ ఐ హాస్పిటల్‌, మణిపాల్‌ హాస్పిటల్‌ వారు సహకరిస్తున్నారు.

డిసెంబర్‌ 17వ తేదీన గుంటూరు జిల్లాలోని రేపల్లెలో క్యాన్సర్‌  స్క్రీనింగ్‌ క్యాంప్‌, ఐ క్యాంప్‌, డెంటల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. డా. ప్రకాశ్‌ రావు దీనికి సంబంధించిన వ్యవహారాలను చూస్తారు.

డిసెంబర్‌ 18వ తేదీన కృష్ణా జిల్లాలోని కంకిపాడులో తానా రైతుకోసం కార్యక్రమం జరగనున్నది. డా. రాజేష్‌ అడుసుమిల్లి ఈ కార్యక్రమానికి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. గన్నవరంలో కమ్యూనిటీ కార్యక్రమం జరుగుతుంది. కమ్యూనిటీ నాయకుల విగ్రహావిష్కరణ జరుగుతుంది. డా. ప్రసాద్‌ తోటకూర దీనికి కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో తానా స్టేట్‌ లెవెల్‌ చెస్‌ స్కాలర్‌షిప్‌ ఛాంపియన్‌ షిప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్ళు ఇందులో పాల్గొంటున్నాయి. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంప్స్‌, ఐ క్యాంప్‌, కార్డియాక్‌ క్యాంప్‌ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన వ్యవహారాలను శ్రీనివాస్‌ గోగినేని చూస్తున్నారు. 19వ తేదీన విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ ముగింపు కార్యక్రమం జరుగుతుంది. క్యాన్సర్‌ స్రీనింగ్‌ క్యాంప్‌ కూడా ఏర్పాటు చేశారు. ఎపి స్టేట్‌ చెస్‌ అసోసియేషన్‌, ఎన్టీఆర్‌ ట్రస్‌ ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నాయి.

డిసెంబర్‌ 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని మిర్తిపాడులో కమ్యూనిటీ ఈవెంట్‌ కార్యక్రమం జరుగుతుంది. జనార్దన్‌ నిమ్మలగడ్డ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అదేరోజున రాజమండ్రిలో విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అమెరికాలో కెరీర్‌ సంబంధించిన విషయాలపై ఇందులో అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థుల సందేహాలను తీర్చనున్నారు. తానా జానపద కళోత్సవాలు, ఐ క్యాంప్‌ ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. జంపాల చౌదరి, శ్రీనివాస్‌ గోగినేని ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. పార్లమెంట్‌ సభ్యుడు మురళీ మోహన్‌, ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, లయన్స్‌ హాస్పిటల్‌, బ్రెడ్‌ సొసైటీ, సైంటిఫిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఇందులో పాల్గొంటున్నాయి. డిసెంబర్‌ 21న వైజాగ్‌లోని అచ్చుతాపురంలో తానా రైతుకోసం, సర్వీస్‌ యాక్టివిటీస్‌ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంజయ్య చౌదరి లావు దీనికి కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. వైజాగ్‌లో గ్రహణమొర్రి చికిత్స, హుదూద్‌ తుపాన్‌ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష వంటివి జరుగుతుంది. శ్రీనివాస్‌ గోగినేని, సతీష్‌ వేమన దీనికి సంబంధించిన వ్యవహారాలను చూస్తున్నారు.

22వ తేదీన తిరుపతిలో యూనివర్సిటీ విద్యార్థులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తానా రైతుకోసం కార్యక్రమం కూడా జరుగుతుంది. సతీష్‌ వేమన, సునీల్‌ పాంత్రా ఈ కార్యక్రమాలను చూడనున్నారు. 23వ తేదీన తిరుమల, అక్కడ నుంచి ర్నూలుకు వెళుతారు. కర్నూలు, కప్పట్రాళ్ళలో క్యాన్సర్‌ స్రీనింగ్‌ క్యాంప్‌, డిజిటల్‌ తరగతుల ప్రారంభంతోపాటు తెలుగు నాటకోత్సవాలను ఏర్పాటు చేశారు. రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఇవి జరగనున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కలుకుంట్ల తానా రైతు కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 24వ తేదీ కూడా కర్నూలులోనే కార్యక్రమాలు జరుగుతాయి.

26న తమిళనాడులోని కోయంబత్తూరులో ఎల్లలు లేని తెలుగు కార్యక్రమం జరుగుతుంది. జంపాల చౌదరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేరోజున అనంతపురం జిల్లాలోని రత్నగిరిలో తానా ఆధ్వర్యంలో రైతు కోసం కార్యక్రమాన్ని రవిపొట్లూరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

డిసెంబర్‌ 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తానా స్టేట్‌ లెవెల్‌ చెస్‌ స్కాలర్‌ షిప్‌ కార్యక్రమం జరుగుతుంది. 27 సాయంత్రం తెలంగాణ కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌ సహకారంతో కల్చరల్‌ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అశోక్‌బాబు కొల్లా ఈ కార్యక్రమాలను చూడనున్నారు. అదేరోజున ప్రకాశం జిల్లాలోని తడివారిపల్లిలో తానా రైతుకోసం కార్యక్రమం జరగనున్నది. చెంచురెడ్డి తడి దీనికి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. 28వ తేదీన నిజామాబాద్‌ జిల్లాలోని వర్నిలో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌, స్కూల్‌ లైబ్రరీ, కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ను ఏర్పాటు చేశారు. రమణ్‌ మాదాల దీనిని సంబంధించిన వ్యవహారాలను చూస్తున్నారు. 29వ తేదీ కూడా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌ ఇక్కడే జరుగుతుంది.

డిసెంబర్‌ 29న ఖమ్మం జిల్లాలో సాహిత్య కార్యక్రమం జరుగుతుంది. దాశరథి బ్రదర్స్‌ విగ్రహావిష్కరణ, హ్యాపీ హోమ్స్‌ బిల్డింగ్‌ ప్రారంభోత్సవం, స్కూల్‌ లైబ్రరీ, తానా రైతుకోసం వంటి కార్యక్రమాలన ఏర్పాటు చేశారు. మధు తాతా, శ్రీనివాస్‌ గోగినేని, మువ్వా శ్రీనివాసరావు ఈ కార్యక్రమాలకు కో ఆర్డినేటర్లుగా ఉన్నారు. డిసెంబర్‌ 30న ఖమ్మంలో తానా రైతు కోసం కార్యక్రమం జరుగుతుంది. జే తాళ్ళూరి దీనికి కో ఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు.

 

Tags :