తెలుగు రాష్ట్రాల్లో 23 నుంచి 'తానా' చైతన్య స్రవంతి
అమెరికాలో నాలుగు దశాబ్దాలకుపైగా తెలుగు కమ్యూనిటీకి విస్తృతంగా సేవలందిస్తూ, మరోవైపు తెలుగు భాష, తెలుగు కళలు, తెలుగు సంస్కృతి విస్తరణకు కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాతృరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా అనేక కార్యక్రమాలను చేస్తోంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి అమెరికాలో పెద్దఎత్తున తానా మహాసభలను నిర్వహిస్తూ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కళాకారులను, తెలుగు ప్రముఖులను ఈ మహాసభలకు ఆహ్వానించడం ద్వారా అమెరికాలో తెలుగు వైభవాన్ని మహాసభల ద్వారా తెలియజేస్తోంది. వచ్చే సంవత్సరం జూలై 4 నుంచి 6 వ తేదీ వరకు తానా 22వ మహాసభలు వాషింగ్టన్ డీసిలో జరగనున్నాయి. ఈ మహాసభలకు ముందుగా మాతృరాష్ట్రంలో 'చైతన్య స్రవంతి' పేరుతో తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించేలా, మరుగునపడిన జానపదకళలను వెలుగులోకి తీసుకు వచ్చేలా తానా పలు కార్యక్రమాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
ఇందులో భాగంగా డిసెంబర్ 23 నుంచి జనవరి 12వ తేదీ వరకు తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నట్లు 'తానా' అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. ఈ చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో రైతు రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమం కోసం తానా ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఇందులో భాగంగానే రైతుకోసం తానా అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిచికారి మందుల వినియోగంలో రైతులకు ఉపయోగపడే రక్షణ సామాగ్రిని కిట్లుగా అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్ తరగతుల ప్రారంభం, రచయితల వర్క్‌షాప్, ఎడ్లపందాలు, కర్నూలులో స్త్రీ శక్తి భవనం ప్రారంభం వంటి వాటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. గురజాల, విజయవాడ, తాడేపల్లిగూడెం, మద్దూరు, తణుకు, భీమిలి, మాడుగుల, కర్నూలు, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, మాచెర్ల, సత్తెనపల్లి, పుల్లడిగుంట, ఒంగోలు, రాజంపేట, తాళ్ళపాక, తిరుపతి, అవనిగడ్డ, పెనుగంచిప్రోలు, విజయవాడ, వీరవల్లి ప్రాంతాల్లో తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వివరించారు.
మహోన్నతమైన తెలుగుభాష పట్ల, తెలుగు కళలపట్ల ప్రేమాభిమానాలను పునరుజ్జీవింపజేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలను తానా నిర్వహిస్తోందని సతీష్ వేమన తెలిపారు. తెలుగు భాష సాహిత్య సంపదలను, కళా సాంస్కృతిక వారసత్వాలను ముందుతరాలకు తెలియజేసే విధంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో తానా నాయకులు, సభ్యులు, అభిమానులు ముమ్మరంగా పాల్గొంటున్నారని, ఈ వేడుకలకు అందరూ రావాలని, కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
చైతన్య స్రవంతి కార్యక్రమాలకు కో ఆర్డినేటర్‌గా తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ జే తాళ్ళూరి వ్యవహరిస్తారని, రైతు కోసం?కార్యక్రమాలకు డా. జానయ్య కోట కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు.
చైతన్య స్రవంతి కార్యక్రమం షెడ్యూల్
డిసెంబర్ 23 గురజాలలో ఎడ్లపందాలు (పర్యవేక్షణ: జానయ్యకోట)
డిసెంబర్ 23 సాయంత్రం విజయవాడలో తానా నాయకుల ప్రెస్‌మీట్
డిసెంబర్ 24 తాడేపల్లి గూడెం, మద్దూరు, తణుకులలో రైతుకోసం కార్యక్రమాలు
(పర్యవేక్షణ: సుమంత్ పుసులూరి)
డిసెంబర్ 26 భీమిలి, మాడుగులలో తానా రైతుకోసం కార్యక్రమాలు (పర్యవేక్షణ: జానయ్యకోట)
డిసెంబర్ 28 కొత్తగూడెంలో 5 కె రన్, డిజిటల్ తరగతుల ప్రారంభం, లక్ష్మీపురం గ్రామంలో
రైతుకోసం కార్యక్రమం (పర్యవేక్షణ: జే తాళ్ళూరి, రవి మందలపు)
డిసెంబర్ 29 ఖమ్మంలో రైతుకోసం కార్యక్రమం, డిజిటల్ తరగతుల ప్రారంభం, ఆటలపోటీలు,
కల్చరల్ నైట్ (పర్యవేక్షణ: జే తాళ్ళూరి)
డిసెంబర్ 30 హైదరాబాద్‌లో రచయితల వర్క్‌షాప్, చిలుకూరులో రైతుకోసం
వర్క్‌షాప్, కల్చరల్ నైట్
(పర్యవేక్షణ లక్ష్మీదేవినేని, జే తాళ్ళూరి, సతీష్ వేమన, రవి పొట్లూరి)
జనవరి 3 మాచర్ల, సత్తెనపల్లిలో రైతుకోసం, కల్చరల్ కార్యక్రమాలు
(పర్యవేక్షణ: జానయ్యకోట, చల కొండ్రకుంట, భాను మాగులూరి)
జనవరి 4 పుల్లడిగుంట, ఒంగోలు - రైతుకోసం కార్యక్రమాలు
(పర్యవేక్షణ: రామ్ చౌదరి ఉప్పుటూరి, అశోక్‌బాబు కొల్లా)
జనవరి 5 రాజంపేటలో ఉదయం రైతుకోసం కార్యక్రమం, సాయంత్రం రాజంపేట నుంచి
తాళ్ళపాక వరకు రాష్ట్రంలోని కళాకారులతో భారీ ప్రదర్శన
(పర్యవేక్షణ: సతీష్ వేమన)
జనవరి 6 రైల్వేకోడూరు/మంగంపేటలో ఎపిఎండిసి సౌజన్యంతో డిజిటల్ తరగతుల
ప్రారంభోత్సవం, రైతుకోసం కార్యక్రమాలు తరువాత తిరుపతి పర్యటన -
పద్మావతీ యూనివర్సిటీ, మహతి ఆడిటోరియంలలో తానా కార్యక్రమాలు
(పర్యవేక్షణ: సతీష్ వేమన)
జనవరి 7 అవనిగడ్డ, పెనుగంచిప్రోలు - రైతుకోసం కార్యక్రమం
(పర్యవేక్షణ: రాజా సూరపనేని, రవి పొట్లూరి)
జనవరి 8 విజయవాడ - 5కె వాక్, వీరవల్లిలో సిపిఆర్ కార్యక్రమం,
సాయంత్రం విజయవాడలో కల్చరల్ నైట్
(పర్యవేక్షణ: సతీష్ వేమూరి, అంజయ్య చౌదరి, రాజా కసుకుర్తి)
జనవరి 12 కర్నూలులోని కప్పట్రాళ్ళలో స్త్రీ శక్తి భవనం ప్రారంభోత్సవం,
తానా సంక్రాంతి కార్యక్రమాలు (పర్యవేక్షణ: రవి పొట్లూరి)
జనవరి 12 పశ్చిమగోదావరి - చిన్నయ్యగూడెంలో మెగా క్యాన్సర్ క్యాంప్
(పర్యవేక్షణ: ఆచంట సుబ్బయ్య చౌదరి, విద్యాగారపాటి)
TANA Chaitanya Sravanthi Schedule