గురజాలలో ప్రారంభమైన 'తానా' చైతన్యస్రవంతి కార్యక్రమాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్ళకోమారు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే చైతన్య స్రవంతి కార్యక్రమాలు గుంటూరు జిల్లా గురజాలలో ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. గురజాల పట్టణంలో శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ళను పురస్కరించుకుని ఎడ్లపందాలను తానా ఏర్పాటు చేసింది. ఈ పోటీలను గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. తానా అధ్యక్షుడు సతీష్ వేమన మాట్లాడుతూ, తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలను ఈసారి పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. జనవరి 12వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ కొండ్రగుంట్ట చలపతి, రీజనల్ ఉపాధ్యక్షుడు ఎస్. లక్ష్మి నారాయణ, చింతమనేని సుధీర్, రీజనల్ కో ఆర్డినేటర్ కోటా రఘు, డాక్టర్ బొడ్డపాటి సీతరామ్, డాక్టర్ కోట జానయ్యతోపాటు డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాసు, పులుకూరి కాంతారావు, గడిపూడి పెద్ద చెన్నయ్య, పోటు నాగేశ్వరరావు, గనిపల్లి శ్యాము, కమిటీ సభ్యులు మల్లా లక్ష్మయ్య, నెల్లూరి మలయ్య, దొప్పలపూడి వెంకటకృష్ణ, చాగంటి బ్రహ్మం, తన్నెటి బుచ్చిబాబు, తదితరులు పాల్గొన్నారు.