ASBL Koncept Ambience

కంచికచర్లలో ఘనంగా 'తానా' చైతన్యస్రవంతి

కంచికచర్లలో ఘనంగా 'తానా' చైతన్యస్రవంతి

కృష్ణాజిల్లాలోని కంచికచర్లలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్‌  ఆధ్వర్యంలో చైతన్యస్రవంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కంచికచర్ల జాతీయరహదారిపై పేరకలపాడు క్రాస్‌ వద్ద నుంచి మార్కెట్‌ యార్డ్‌ వరకు తానా 5కె రన్‌ నిర్వహించారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికే ఈ 5కె రన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పంచుమర్తి నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు. తరువాత సెంటినీ ఆసుపత్రి ఆధ్వర్యంలో రోగులకు ఉచిత వైద్యచికిత్స నిర్వహించారు. ఎంఐసి కాలేజి ఆఫ్‌ టెక్నాలజీ దీనికి సహకారం అందించారు. కొంగర శ్రీకాంత్‌ ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ ప్రసాద్‌, కార్యదర్శి అంజయ్య చౌదరిలావు, రవి మందలపు, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :