నేరడలో ‘తానా’ ట్రై సైకిళ్లు, ల్యాప్ టాప్ ల పంపిణీ
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో ‘తానా’ ఆధ్వర్యంలో మంగళవారం నాడు చైతన్య స్రవంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామంలో ఉన్న నిరుపేద విద్యార్థినులకు సైకిళ్లను వికలాంగులకు ట్రై సైకిళ్లను మెరిట్ విద్యార్థికి ల్యాప్ టాప్ ను విరాళంగా అందించారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తానా తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, తానా మాజీ అధ్యక్షుడు జయ శేఖర్ తాళ్లూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా ఫౌండేషన్ ట్రష్టి సామినేని రవి సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా పిచ్చిరెడ్డి ఎంపీపీ గుగులోతు పద్మావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు తానా నేతలకు గ్రామ ప్రజలు భాజా భజంత్రీలతో స్వాగతం పలికారు.
Tags :