‘తానా’ చైతన్య స్రవంతి నిర్వహిస్తున్న ‘తానా - సాంస్కృతిక కళోత్సవాలకు’ ఆత్మీయ ఆహ్వానం!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) - గ్రామీణ కళలు, జానపద నృత్య ప్రదర్శనలు మరుగున పడిపోకుండా, కళాకారులు, రైతులు మరియు పేదలకు చేయూతను అందించి, వారిని ప్రోత్సాహిస్తూ, మన గ్రామీణ ఆట పాటలు, సంగీత, సాహిత్య, సాంస్కృతిక కళలు మనతో పాటు, భావితరాలు వాటి ప్రాముఖ్యతను తెలుసుకొని ఆనందించేలా, తెలుగు వారు అందరికోసం ‘తానా’ చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో
గంగా జాతర జానపద నృత్యాలు ,
ప్రతిభ గల బాలికల గ్రూపుతో చెక్క భజనలు నిర్వహణ,
తెలుగు గ్రామీణ విశిష్టతను తెలియ చేసే డప్పులు నైపుణ్య ప్రదర్శన,
ప్రత్యేక తెలుగు జానపద వాయిద్యాలతో జానపద కళా ప్రదర్శన,
నిప్పు కుండలతో ఆసక్తి రేకెత్తించే శాస్త్రీయ(క్లాసికల్) నృత్య ప్రదర్శన,
ప్రత్యేక మ్యూజిక్ బ్యాండ్ తో తెలుగు పాటలు …
వంటి అద్భుతమైన కార్యక్రమాలను R&D ఆడిటోరియం, KL యూనివర్సిటీ లో నిర్వహిస్తున్నాము.
Date: 19th December 2022
Time : 5pm to 9 pm
Venue : R&D ఆడిటోరియం
KL యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్
మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం, ‘తానా’ సాంస్కృతిక కళోత్సవాల కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయగలరు!
మీ…
‘తానా’ చైతన్య స్రవంతి బృందం!
(2022-2023)