అవనిగడ్డలో బాలికలకు తానా సైకిళ్ళ పంపిణీ
తానా చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా అవనిగడ్డలో పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. ఎడ్ల లంక గ్రామం నుండి ప్రతిరోజు కాలినడకన అవనిగడ్డ హైస్కూల్ కి వస్తున్న 25 మంది బాలికలకు తానా ఫౌండేషన్ ద్వారా విరాళంగా సైకిళ్ళను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు మాజీ మంత్రి అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వెనుకబడిన అవనిగడ్డ ప్రాంతంలో తానా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా తదుపరి అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా కార్యదర్శి వేమూరి సతీష్, తానా ఫౌండేషన్ ట్రస్టీలు రవి సామినేని, విశ్వనాథ్ నాయనిపాటి తదితరులు పాల్గొన్నారు.
Tags :