బంగారుపాళ్యంలో తానా చైతన్యస్రవంతి
బంగారుపాళ్యంలోని బీపీకెఎన్ కాంప్లెక్స్‌లో తెదేపా మండల అధ్యక్షుడు జయప్రకాష్‌నాయుడు, తానా చైతన్య స్రవంతి మండల కోఆర్డినేటర్ భాష్యం వంశీచౌదరి, మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. 10మంది ఉత్తమ రైతులను సత్కరించారు. 10మంది పేద విద్యార్థులకు సైకిళ్లు, 10 మంది మహిళలకు కుట్టుమిషన్లు, 10 మంది రైతులకు స్ప్రేయర్లు ఇచ్చారు. 80 మంది ఆదర్శ రైతులకు పరికరాలు అందించారు. చెవిటి, కంటి సమస్యలతో బాధపడుతున్న 52 మందికి కంటి శస్త్రచికిత్సలు కడపలో నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు లావు అంజయ్యచౌదరి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో ఏటా రూ.85 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారైలు రవి పొట్లూరి, సునీల్ పంత్ర, మోహన్ ఈదర, జోగేశ్వరరావు పెద్దిబోయిన ఎమ్మెల్సీ దొరబాబు టిడిపి జిల్లా అధ్యక్షుడు నాని మండల టిడిపి అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు మాజీ ఏఎంసీ చైర్మన జయచంద్ర నాయుడు మాజీ సర్పంచ్ సురేంద్ర నాయుడు మాజీ జెడ్పీటిసీ ఎల్వి సుభాష్ నాయుడు చిత్తూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ క్లస్టర్ ఇంచార్జి ధరణి నాయుడు, చిత్తూరు సర్పంచుల సంఘం కార్యదర్శి మురళి, మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కమల్నాథరెడ్డి, తగ్గువారి పల్లి ఉపసర్పంచ్ లోకనాథ నాయుడు, రఘు, సింగిల్ విండో మాజీచైర్మన్ హేమచంద్ర నాయుడు, తెలుగు యువత అధ్యక్షులు రమేష్ బాబు, బీసీ నాయకులు హరిప్రసాద్ గురు స్వామి ఎస్సీ సెల్ అధ్యక్షులు రవి సర్పంచుల స్వామి దాస్ అనిల్ కుమార్ చీపురుపల్లి రవి ద్రాక్షాయని రమేష్ అధికార ప్రతినిధి మంజునాథ్ మాజీ ఎంపీటీసీలు గిరిబాబు సుజాత శ్రీనివాసులు పాల్గొన్నారు.