గోపాలపురంలో బాలికలకు సైకిళ్ళు ఇచ్చిన తానా
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం, గోపాలపురం ఉన్నత పాఠశాలలో 13మంది బాలికలకు ఆదరణ కార్యక్రమంలో భాగంగా 13 సైకిళ్ళు అందజేశారు. తానా ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ యార్లగడ్డ వెంకట రమణ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. తానా అందించి సహాయానికి మారుమూల గిరిజన గ్రామాలనుంచి నడిచి వస్తున్న ఆడపిల్లలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.తామంతా పాఠశాల సమయం ముగిసిన తరువాత బిక్కుబిక్కుమంటూ డొంక రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే ఈ అమ్మాయిలు తమకు సైకిళ్ళు అందించడంలో సహాయపడిన రవి సామినేనికి, ఇతర దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.
Tags :