ASBL Koncept Ambience

తణుకు మండలంలో తానా చైతన్య స్రవంతి

తణుకు మండలంలో తానా చైతన్య స్రవంతి

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా  తణకు మండలం దువ్వ గ్రామంలో స్థానిక సాయిబాబా ఆలయం వద్ద తానా ఫౌండేషన్‌, గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ హైదరాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో తానా చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని తానా ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌ లావు అంజయ్య చౌదరి, రాధాకృష్ణ ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాధాకృష్ణ మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శిబిరంలో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ నిర్ధరణ, వినికిడి, కంటి తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో సుమారు 400 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్థంగా తానా ఆర్థిక సాయంతో రైతులకు  25 స్ప్రేయర్లు, 50 రక్షణ కిట్లు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.  ప్రమాదవశాత్తు చేయి కోల్పోయిన వ్యక్తికి కృత్రిమ చేయిని బహుకరించారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ వై వెంకటరమణ, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ ఎన్‌ జనార్ధన్‌, ఇంటర్‌నేషనల్‌ కో ఆర్డినేటర్‌ వి హితేష్‌, ఉమెన్‌ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ ఉమా, ట్రస్ట్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

 

Click here for Photogallery

 

 

Tags :