ASBL Koncept Ambience

రాజంపేటలో 'తానా' చైతన్యస్రవంతికి భారీ ఏర్పాట్లు

రాజంపేటలో 'తానా' చైతన్యస్రవంతికి భారీ ఏర్పాట్లు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ?ఆధ్వర్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో రాజంపేటలో 5వ తేదీన జరగనున్న తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు చేసినట్లు సంఘం అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు. 5వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పాత బస్టాండ్‌ సర్కిల్‌ నుంచి దాదాపు 500 మంది వివిధ కళా బృందాలతో బోయనపల్లె అన్నమయ్య విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ప్రముఖ గాయనీగాయకులు, రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు తానా నాయకులు, అభిమానులు ఇందులో పాల్గొంటారని ఆయన వివరించారు. సాయంత్రం?6 గంటలకు రైతులకోసం రక్షణ పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు కూడా చెప్పారు. రాత్రి 8 గంటలకు అన్నమయ్య సంగీత కచేరీ ఉంటుందన్నారు. సినిమా గాయనీ గాయకులతో సంగీత విభావరి, మిమిక్రీ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయని సతీష్‌ వేమన చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.

 

Tags :