ASBL Koncept Ambience

తణుకు, మద్దూరులో ఘనంగా 'తానా' చైతన్యస్రవంతి

తణుకు, మద్దూరులో ఘనంగా 'తానా' చైతన్యస్రవంతి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన రైతుకోసం కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యుడు అరిమిల్లి రాధాకృష్ణ తానా ఇస్తున్న రైతు రక్షణ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానా కమ్యూనిటీకి చేస్తున్న సేవలు అభినందనీయమని చెప్పారు. రైతు రక్షణకోసం తానా చేస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పారు. రైతులు కూడా పురుగుమందుల పిచికారీ సమయంలో తానా అందించిన రక్షణ పరికాలను వినియోగించాలని ఆయన కోరారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని దాదాపు 150 మంది రైతులకు ఈ రక్షణ పరికరాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తానా రైతుకోసం కార్యక్రమాల కో ఆర్డినేటర్ జానయ్య, సుందర్, మల్లికార్జునరావు, ఏఎంసి చైర్మన్ తోట సూర్యనారాయణ, తణుకు ఎంపిపి కట్టా అనంతలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. సుమంత్ పుసులూరి, ప్రకాశ్ పుసులూరి ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను చేశారు. మద్దూరులో కూడా తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. జడ్పి చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.

Click here for Event Gallery

 

Tags :