పెనుగంచిప్రోలులో ఘనంగా తానా చైతన్యస్రవంతి
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో చైతన్యస్రవంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రైతుకోసం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, రైతులు, తానా నాయకులు పాల్గొన్నారు. శేషు కర్ల ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగా, రాజా సూరపనేని కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా రైతుకోసం?కార్యక్రమానికి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న జానయ్య కోట రైతు రక్షణకు తానా చేస్తున్న కృషిని వివరించారు. తానా కార్యదర్శి లావు అంజయ్య చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా రైతుల రక్షణకోసం ఇస్తున్న పరికరాలను పలువురు రైతులకు ఈ కార్యక్రమంలో అందజేశారు.
Tags :