ASBL Koncept Ambience

తొర్రేడు గ్రామంలో చైతన్య స్రవంతి కార్యక్రమాలు

తొర్రేడు గ్రామంలో చైతన్య స్రవంతి కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలోని తొర్రేడు గ్రామంలో డిసెంబర్‌ 9న నిర్వహించిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో తానా నాయకులు పలువురు పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మాజీ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల, మహిళా కార్యదర్శి డా. ఉమా ఆరమండ్ల కటికి, ఇంటర్నేషనల్‌ కోఆర్డినేటర్‌ హితేష్‌ వడ్లమూడి, ఫౌండేషన్‌ ట్రస్టీ శ్రీనివాస్‌ ఓరుగంటి, రాజా ముత్యాల, సుమంత్‌ పుసులూరి,  రాజమండ్రి రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తానా చైతన్య స్రవంతిలో భాగంగా నిర్వహించిన ఆరుణ్య ఉచిత వినికిడి పరీక్షలు, రైతు కోసం పవర్‌ స్ప్రేయర్లు, ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంపు, చేయూత స్కాలర్షిప్స్‌, ఉచిత కంటి పరీక్షలు, పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు, సైంటిఫిక్‌ మోటివేషన్‌ సదస్సు వంటి కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. 

తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ జనార్దన్‌ నిమ్మలపూడి, తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి, తానా ఫౌండేషన్‌ ట్రస్టీ విద్యాధర్‌ గారపాటి, ప్రకాష్‌ బత్తినేని మరియు సతీష్‌ చుండ్రు ఈ కార్యక్రమాలకు స్పాన్సర్‌ చేశారు.  

 

Click here for Photogallery

 

 

Tags :