ASBL Koncept Ambience

హైదరాబాద్ లో తానా చదరంగ పోటీలు...చెస్ టోర్నీ పోస్టల్ స్టాంప్ విడుదల

హైదరాబాద్ లో తానా చదరంగ పోటీలు...చెస్ టోర్నీ పోస్టల్ స్టాంప్ విడుదల

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)ఉభయ తెలుగు రాష్ట్రలలో గ్రామీణ ప్రాంతాలకు తన సేవలను విస్తరింప చేయటం అభినందించదగ్గ విషయమని తెలంగాణ ప్రభుత్వ విప్‌, మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తానా రాష్ట్ర స్థాయి ప్రభుత్వ పాఠశాలల చదరంగం స్కాలర్‌షిప్‌ టోర్నమెంట్‌ పాఠశాలల చదరంగం స్కాలర్‌షిప్‌ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అబిడ్స్‌లోని ప్యాస్ట్రల్‌ సెంటర్‌లో  జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించి ప్రసంగించారు. మాతృదేశంపై ప్రమేతో అమెరికాలో స్థిరపడిన తెలుగువారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందించడం అభినందించదగ్గ విషయమన్నారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస గోగినేని మాట్లాడుతూ తాను స్వతహాగా చెస్‌ క్రీడాకారుడినని ఆ అభిమానంతోనే  ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు తానా ను చేరువ చేద్దామని సదుద్దేశ్యంతో ఉభయ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తానా ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి తాతామధు, డైరెక్టర్‌ చలపతిరావు, కొండ్రకొండ, లావాణ్యదువ్వీ, తెలంగాణ చెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అనంచిన్ని వెంకటేశ్వరరావు, సభ్యులు గుంటి సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డి, విజయ్‌, రజనికాంత్‌, అనుప్‌, నీలేష్‌, శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల  నుండి మొత్తం వంద మంది బాలబాలికలు టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో గెలుపొంది బాలబాలికలకు మొదటి స్థానంలో నిలిచిన వారికి చేరి  రూ.50వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.30వేల చొప్పున క్యాస్‌ప్రైజ్‌ అవార్డును అందజేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలోనే తానా 40 వసంతాల వేడుకల సందర్భంగా నగరంలో నిర్వహిస్తున్న తానా స్కాలర్‌ షిఫ్‌ చెస్‌ టోర్నమెంట్‌కు గుర్తుగా చెస్‌ టోర్నీ లోగోతో కూడిన ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి విడుదల చేశారు. తొలి పోస్టల్‌ స్టాంప్‌ను తానా ఫౌండేషన్‌ శ్రీనివాస గోగినేనికి అందించారు.

 

Tags :