ASBL Koncept Ambience

తానా చెస్‌ టోర్నమెంట్‌... ప్రతిభ చాటిన చిన్నారులు

తానా చెస్‌ టోర్నమెంట్‌... ప్రతిభ చాటిన చిన్నారులు

పట్టుదల, ఏకాగ్రత, ఎత్తుకు పై ఎత్తులు వేయడం వంటివి పిల్లల్లో ఉన్న తెలివితేటలను పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతాయని అంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల సందర్భంగా పిల్లల కోసం చెస్‌ టోర్నమెంట్‌ను ఫిలడెల్ఫియాలోని ఎక్స్‌టన్‌ నగరంలో జూన్‌ 4వ తేదీన నిర్వహించింది. ఈ టోర్నమెంట్‌కు ఊహించని విధంగా మంచి స్పందన వచ్చింది. చాలామంది పిల్లలు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడంపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి అభినందించారు. ఫణి కంతేటి, నాయుడమ్మ చౌదరి యలవర్తి, సునీల్‌ కోగంటి, టోర్నమెంట్‌ డైరెక్టర్‌ జాషువా ఆండర్సన్‌ తదితరులు ఈ టోర్నమెంట్‌ విజయానికి కృషి చేశారు. ఈ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచినవారికి ట్రోఫీలను బహుకరించారు.

చదరంగం (చెస్) ఆటల విజేతలు వివరాలు:

కే-6 విభాగం:
మొదటి బహుమతి విజేత: ఇషాన్ వీరం
రెండొవ బహుమతి విజేత: ప్రణవ్ కంతేటి
మూడోవ బహుమతి విజేత: విలోహిత్ కొడకండ్ల

కే-12 విభాగం:
మొదటి బహుమతి విజేత: శ్రేనిక్ పిల్లి
రెండొవ బహుమతి విజేత: అక్షజ్ గిల్ల
మూడోవ బహుమతి విజేత: సిద్ధార్థ్ గుప్త

అండర్-400 విభాగం:
మొదటి బహుమతి విజేత: ప్రేమసాయి నల్లపరెడ్డిగారి
రెండొవ బహుమతి విజేత: సిద్ధార్థ్ యేలిశెట్టి
మూడోవ బహుమతి విజేత: నంద వీ మేళం

అండర్-800 విభాగం:
మొదటి బహుమతి విజేత: రితిక్ రావు 
రెండొవ బహుమతి విజేత: అశ్రీత్ ప్రసాద్ మరింగంటి
మూడోవ బహుమతి విజేత: విరాజ్ జైరాత్ 

ఓపెన్ రేటెడ్ విభాగం: 
మొదటి బహుమతి విజేత: జోసెఫ్ జె, జూనియర్. ముసిరినో
రెండొవ బహుమతి విజేత: పల్లవి రాజీవ్
మూడోవ బహుమతి విజేత: మోహిత్ అనిరుద్ ప్రసాద్ మరింగంటి

 

Click here for Photogallery

 

Tags :