తానా ఒహాయో వ్యాలీ ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఒహాయో వ్యాలీలో ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. వరుసగా 3వ సంవత్సరం కూడా నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో దాదాపు 400కు పైగా ఉమెన్స్ క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఉమెన్స్ క్రికెట ్‌టోర్నమెంట్‌ను తొలుత డా. జంపాల చౌదరి హయాంలో ప్రారంభించారు. తరువాత సతీష్ వేమన హయాంలో కూడా ఈ టోర్నమెంట్ జరిగింది. ప్రస్తుతం జే తాళ్ళూరి హయాంలో కూడా ఈ టోర్నమెంట్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో 8 టీమ్‌లు పాల్గొన్నాయి. తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, జగదీష్ ప్రభల, అశోక్ కొల్లా, రవి సామినేని, శ్రీని యలవర్తి, శివ చావె, సిద్ధార్థ రేవూరు, శరత్ కొమ్మినేని, నాని వడ్లమూడి, సుష్ ఉప్పుటూరి, రాజ్ బొమ్మన ఇతర వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజేతలకు డెలావేర్ కౌంటీ కమిషనర్, ఇతర స్పాన్సర్లు బహుమతులను అందజేశారు.