తానా కాన్ఫరెన్స్ ఏర్పాట్లను సమీక్షించిన సతీష్ వేమన
వాషింగ్టన్ డీసిలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించే తానా 22వ మహాసభల ఏర్పాట్లపై తానా అధ్యక్షుడు సతీశ్ వేమన ఆధ్వర్యంలోని తానా 2019 కాన్ఫరెన్స్ కమిటీ సమీక్షించింది. వివిధ కమిటీలకు చెందిన 200 మంది ప్రతినిధులతో వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో బృందం సమావేశమైంది. మారియట్ మార్కిస్ హోటల్, మారియట్ రినైసెన్స్‌లను కూడా సతీశ్ వేమన బందం సందర్శించింది. తానా మహాసభల కార్యక్రమాలు ఎక్కడ నిర్వహిస్తే బావుంటుంది, హాజరయ్యే అతిథులకు ఎటువంటి సదుపాయాలు కల్పించాలి వంటి విషయాలపై సభ్యులంతా చర్చించినట్లు తానా నాయకులు తెలిపారు.
Tags :