ASBL Koncept Ambience

పెన్సిల్వేనియా, హారీస్‌బర్గ్‌ లో ‘తానా’ కన్వెన్షన్ కిక్‌ ఆఫ్‌ మీటింగ్‌ కు అనూహ్య స్పందన!‌ 

పెన్సిల్వేనియా, హారీస్‌బర్గ్‌ లో ‘తానా’ కన్వెన్షన్ కిక్‌ ఆఫ్‌ మీటింగ్‌ కు అనూహ్య స్పందన!‌ 

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు అంగరంగ వైభవంగా నిర్వహించే మహాసభలు ఈ సంవత్సరం జూలై 7,8,9 తేదీల్లో ఫిలడెల్ఫియాలో కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్నాయి. 

ఈ మహాసభలకు ముందు జరిగే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పెన్సిల్వేనియా, హారీస్‌బర్గ్‌ లో ‘తానా కన్వెన్షన్ కిక్‌ ఆఫ్‌ మీటింగ్‌’ జరిగింది. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తానా సభ్యులు, శ్రేయోభిలాషులు, దాతలు, ఇతర తెలుగు సంఘాల నాయకులు హాజరై మహాసభల విజయవంతానికి తమవంతుగా సహకారాన్ని అందిస్తామని హామి ఇచ్చారు. 

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ, అమెరికాలోని తెలుగువారితో పాటు ఇక్కడ కమ్యూనిటీ తో  పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు కూడా తానా సేవా కార్యక్రమాలను సేవలందిస్తున్న విషయాన్ని తెలియజేస్తూ తానా ఇకముందు కూడా కమ్యూనిటీకి అవసరమైన మరెన్నో సేవా కార్యక్రమాలతో పాటు సహాయ, సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు.

తానా మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి మాట్లాడుతూ, తానా మహాసభల్లో పాల్గొనడమే గొప్పగా భావిస్తారని, ఈసారి ఈ మహాసభలను ఫిలడెల్ఫియాలో దాదాపు 22 సంవత్సరాల తరువాత నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలోని తెలుగువారందరిపై ఉందని అంటూ, ఈ మహాసభల విజయవంతానికి సహకరించడానికి ముందుకు వచ్చిన దాతలకు ధన్యవాదాలను తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో తానా మహాసభల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి మందలపు, కార్యదర్శి సతీష్‌ తుమ్మల, మిడ్‌ అట్లాంటిక్‌ ప్రాంత ప్రతినిధి సునీల్‌ కోగంటి, విల్మింగ్టన్‌ సిటీ కోఆర్డినేటర్‌ లక్ష్మణ్‌ పర్వతనేని,హారీస్‌ బర్గ్‌ సిటీ కోఆర్డినేటర్‌ వెంకట్‌ చిమిలి, శ్యామ్‌ బాబు వెలువోలు, ఆటా మాజీ అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి, సతీష్‌ చుండ్రు, వెంకట్‌ సింగు, కిరణ్‌ కొత్తపల్లి, రామకృష్ణ పమిడిముక్కల, హను తిరుమల రెడ్డి తదితరులు పాల్గున్నారు. 

ఆటా, నాటా, టాటా, డాటా, హారీస్‌బర్గ్‌ తెలుగు సంఘం ప్రతినిధులతోపాటు ఇతరులు కూడా హాజరై తానా మహాసభలకు తమ తోడ్పాటు ఉంటుందని ప్రకటించారు.

 

Click here for Photogallery

 

 

Tags :