తానా క్రూయిజ్ యాత్ర 2019 జయప్రదం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలంగాణలోని చేనేత కళాకారుల సహాయార్థం నిర్వహించిన క్రూయిజ్ యాత్ర ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. సెప్టెంబర్ 8వ తేదీన తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి రిబ్బన్ కట్ చేసి యాత్రను ప్రారంభించారు. హడ్సన్ రివర్‌లో సాగిన ఈ యాత్రలో దాదాపు 450 మంది పాల్గొన్నారు. ఓవైపు మన్‌హట్టన్ అందాలను వీక్షిస్తూ, మరోవైపు తానా నాయకులు ఏర్పాటు చేసిన డిజె, మ్యూజిక్, ఆటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా యాత్రను ఎంజాయ్ చేశారు. చిన్నారుల కోసం కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలను తానా నాయకులు ఏర్పాటు చేశారు. ఫన్ విత్ ఫేస్ పెయింటింగ్, మ్యాజిక్ ,a, బెలూన్ ట్విస్టింగ్, టట్టూస్ వంటి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.
తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా బోర్డ్ చైర్మన్, డైరెక్టర్ హరీష్ కోయ, తానా కార్యదర్శి రవి పొట్లూరి తదితరులు మాట్లాడుతూ, తెలంగాణలో చేనేత కళాకారుల కోసం చింతకింది మల్లేశంతయారు చేసిన 1000 అసు యంత్రాలను పోచంపల్లి చేనేత కళాకారులకు అందించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వంతో తానా చేసుకున్న ఒప్పందాన్ని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా 160 అసు యంత్రాల కొనుగోలుకు నిధులను సేకరించినట్లు చెప్పారు.
తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ లక్ష్మీదేవినేని, ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల మాట్లాడుతూ, మహిళా సాధికారతకోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఫౌండేషన్ ట్రస్టీ రావు యలమంచిలి, ఫౌండేషన్ ట్రస్టీ విశ్వనాథ్, న్యూయార్క్, న్యూజెర్సి మాజీ రీజినల్ రిప్రజెంటెటివ్ విద్యాగారపాటి తదితరులు కూడా మాట్లాడారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి న్యూయార్క్ తానా నాయకులు చేసిన కృషిని జే తాళ్ళూరి అభినందించారు. సుమంత్ రామ్‌సెట్టి, రాజా కసుకుర్తి, శంకర్ రసపుత్ర, కిరణ్ పర్వతాల, రావు వోలేటి, పృథ్వీ చేకూరి, దిలీప్ ముసునూరు, అశోక్ బానోత్, దీపిక సమ్మెట, రజని జూలూరు, న్యూజెర్సి తానా నాయకులు రేఖ ఉప్పులూరి, వంశీ వాసిరెడ్డి, సుధీర్, సాయి సూర్యదేవర, శివాని తానా, ప్రవీణ్ రెడ్డి, సాయి పాలేటి, రవి మాచర్ల, మురళీ, వర్ష, కీర్తన గారపాటి, హాసిత్ గారపాటి, అనింధ్య కసుకుర్తి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. స్థానిక తెలుగు సంఘాల నాయకులు టీఎల్‌సిఓ బోర్డ్ చైర్మన్ రాఘవరావు పోలవరపు, పూర్ణ అట్లూరి, ప్రెసిడెంట్ అశోక్ చింతకుంట, వైస్ ప్రెసిడెంట్ బాబు కుదరవల్లి, టాటా ట్రెజరర్ రంజీత్, టిఫాస్ వైస్ ప్రెసిడెంట్ రంగ మాడిసెట్టి, టిఫాస్ సెక్రటరీ మధు రాచకుంట్ల, టిఫాస్ ట్రెజరర్ రేణు తాడేపల్లి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.