టీవీ 9లో ధీంతానా పోటీలు
ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు వైభవంగా జరగనున్న తానా 23వ మహాసభలను పురస్కరించుకుని తానా నిర్వహిస్తున్న ధీంతానా పోటీలను టీవీ9లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. జూలై 1వ తేదీన అట్లాంటా, లాస్ ఏంజెల్స్‌లో, జూలై 2న సెంట్ లూయిస్, కొలంబస్‌లో, జూలై 3న డిట్రాయిట్, రాలే, జూలై 4న ఫిలడెల్ఫియా, చికాగో, జూలై 5న డల్లాస్, న్యూజెర్సి, జూలై 6న వాషింగ్టన్ డీసీలో జరిగే తానా ధీంతానా పోటీలను టీవీ 9, టీవీ 9 యుఎస్‌లో చూడవచ్చు. ఐఎస్‌టీ టైమ్ తెల్లవారుజాము 3.30 గంటలకు, ఇఎస్‌టి టైమ్ సాయంత్రం 6 గంటలకు ప్రసారమవుతుంది.
Tags :