తానా ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు.... ఆంధ్రాపై కర్ణాటక జట్టు విజయం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు గీతం విశ్వవిద్యాలయంలో ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన దక్షిణ భారత దివ్యాంగుల క్రికెట్ పోటీలలో ఆంధ్ర జట్టు పై కర్ణాటక జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు నిర్ణీత 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జట్టులో సాగర్ లమని 14 ఫోర్లతో చెలరేగి 78 పరుగులు సాధించాడు. సమాధానంగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రజట్టు కేవలం 18 ఓవర్లలో 3 వికెట్‌లు నష్టపోయి 133 పరుగులు సాధించింది. ఆంధ్ర జట్టులో ఎమ్. సంతోష్ 9 ఫోర్లతో 54 పరుగులు చేశారు. విజేతలకు తానా క్రీడా విభాగం కో ఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ అభినందించారు.
Tags :