ఫ్రీమాంట్ లో ఫ్రంట్‌లైన్ హీరోలకు తానా లంచ్ బాక్స్ ల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కోవిద్ 19 తో ఆస్పత్రుల్లో చేరిన వారికి చికిత్స చేస్తున్న డాక్టర్లకు, సిబ్బందికి లంచ్ బాక్స్లను పంపిణీ చేశారు. ఫ్రీమాంట్ కైసర్ హాస్పిటల్ సిబ్బందికి, అబోది హోంలెస్ షెల్టరు లో నివసిస్తున్న వారికి లంచ్ బాక్స్ లను తానా నాయకులు పంపిణీ చేశారు. తానా మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి ఆధ్వర్యంలో తానా నాయకులు సతీష్ వేమూరి, వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకరాల, శ్రీకాంత్ దొడ్డపనేని, భక్త బల్ల, గోకుల్ రచిరాజు, భాస్కర్ వల్లభనేని, భరత్ ముప్పిరాల, గోకుల్ రసిరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags :