పెన్సిల్వేనియాలో ఇఎంఎస్ సిబ్బందికి లంచ్ ఇచ్చిన తానా
పెన్సిల్వేనియాలోని సెంట్రల్ బుక్ కౌంటీలో ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ (ఇఎంఎస్) సిబ్బందికి తానా మిడ్‍అట్లాంటిక్ టీమ్ లంచ్‍ను పంపిణీ చేసింది. కోవిడ్ 19 పేషంట్లకు వారు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ తానా నాయకులు కృతఙతాపూర్వకంగా ఈ లంచ్‍ను వారికి ఏర్పాటు చేశారు. తానా కార్యదర్శి రవి పొట్లూరి, తానా మిడ్‍అట్లాంటిక్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ చుండ్రు ఆధ్వర్యంలో మిడ్ అట్లాంటిక్ తానా నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ యలమంచి, తన్మయి యలమంచి ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేశారు. యంగ్ వలంటీర్లు చేస్తున్న సేవలను పలువురు అభినందించారు.
Tags :