ASBL Koncept Ambience

హారీస్‍బర్గ్ తానా టీమ్ లంచ్ బాక్స్ ల పంపిణీ

హారీస్‍బర్గ్ తానా టీమ్ లంచ్ బాక్స్ ల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్‍ అట్లాంటిక్‍ హారీస్‍బర్గ్ టీమ్‍ ఆధ్వర్యంలో మెడికల్‍ సిబ్బందికి లంచ్‍ బాక్స్ లను పంపిణీ చేశారు. కోవిడ్‍ 19 వైరస్‍తో బాధపడుతున్న పేషంట్లకు ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ హారీస్‍బర్గ్ తానా టీమ్‍ వారికి లంచ్‍ బాక్స్ లను పంపిణీ చేసింది. భౌతిక దూరాన్ని పాటిస్తూ జీసింగర్‍-హోలీ స్పిరిట్‍ హాస్పిటల్‍ సిబ్బందికి లంచ్‍ బాక్స్ లను అందజేశారు. ఛాలెంజింగ్‍ టైమ్‍లో తమకు సపోర్టుగా నిలవడంతోపాటు లంచ్‍ ను ఇచ్చినందుకు హారీస్‍బర్గ్ తానా నాయకులకు ఈ సందర్భంగా హాస్పిటల్‍ సిబ్బంది ధన్యవాదాలు చెప్పారు.

తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, సతీష్‍ వేమన, అంజయ్య చౌదరి లావు, రవి పొట్లూరి ఆధ్వర్యంలో తానా కోవిడ్‍ 19 రిలీఫ్‍ చర్యల్లో భాగంగా హారీస్‍బర్గ్లో కూడా సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు తానానాయకులు తెలిపారు. తానా మిడ్‍అట్లాంటిక్‍ రీజినల్‍ వైస్‍ ప్రెసిడెంట్‍ సతీష్‍ చుండ్రు సాంబశివ అంచ, శశిధర్‍ జాస్తి, వెంకటేశ్వరరావు సింగు, వెంకట సుబ్బారావు ముప్పా, రాజు గుండాల, యార్లగడ్డ ప్రతాప్‍, శ్రీనివాస్‍ కోట తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. లంచ్‍ బాక్స్లను సమకూర్చిన పరివార్‍ రెస్టారెంట్‍వారికి, హారీస్‍బర్గ్ తానా టీమ్‍కు, స్పాన్సర్‍కి సతీష్‍ చుండ్రు ధన్యవాదాలు తెలిపారు.

 

Tags :