కర్నూలులో పేదల ముంగిటకు తానా ఆహర పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో తానా కార్యదర్శి రవి పొట్లూరి, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, మోహన్ కుందూరు తదితరుల సహకారంతో అన్నార్తులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని కర్నూలు లోని బుధవారపేటలో కర్నూల్ మూడవ టౌన్ సీఐ తబ్రేజ్ ప్రారంభించారు. అందరూ సామజిక దూరం పాటించాలని శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి మంచి నాణ్యమైన ప్యాకేజి చేసి ఆహరం అందిస్తున్న తానా సేవలు వెలకట్టలేనివన్నారు. ఈ కార్యక్రమం ప్రతి రోజు జరుగుతుందని అన్నార్తుల ఇంటి వద్దే భోజనం అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఈ కార్యక్రమం లాక్ డౌన్ ముగిసేవరకు కొనసాగుతుందని ముప్పా రాజశేఖర్, జంపాల బాబ్జి, జంపాల అమిత్ తెలిపారు.
Tags :