ASBL Koncept Ambience

లాంగ్ఐలాండ్ కమ్యూనిటీ హాస్పిటల్ కు తానా పిపిఇ కిట్ల పంపిణీ

లాంగ్ఐలాండ్ కమ్యూనిటీ హాస్పిటల్ కు తానా పిపిఇ కిట్ల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి ఆధ్వర్యంలో లాంగ్‍ఐలాండ్‍లోని లాంగ్‍ ఐలాండ్‍ కమ్యూనిటీ హాస్పిటల్‍కు పిపిఇ కిట్లను పంపిణీ చేశారు. కోవిడ్‍ 19 పేషంట్లకు తమ ప్రాణాలకు తెగించి కాపాడుతున్న వైద్యసిబ్బందికి అవసరమైన రక్షణ కవచాలను తానా అందజేసింది. ఇలాంటి సమయంలో మనల్ని కాపాడుతున్న ఫ్రంట్‍లైన్‍ సిబ్బందికి అభినందనపూర్వకంగా ఈ సహాయాన్ని అందజేసినట్లు అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి తెలిపారు. వివిధ నగరాల్లో కూడా తానా ఆధ్వర్యంలో ఫ్రంట్‍లైన్‍ సిబ్బందిని అభినందిస్తూ తానా సేవా కార్యక్రమాలను చేస్తోందని చెప్పారు. తూనుగుంట్ల శిరీష, క్రిస్‍ గంధం, హరిశంకర్‍ రాజ్‍పుట్‍ ఈ కార్యక్రమానికి సహకరించారు. లాంగ్‍ఐలాండ్‍ కమ్యూనిటీ హాస్పిటల్‍ క్లినికల్‍ ఇన్ఫర్‍మాటిక్స్ స్పెషలిస్ట్ షాన్‍ జనకరాజ్‍కు తానా ధన్యవాదాలు తెలియజేసింది. ఈ?కార్యక్రమంలో న్యూయార్క్ తానా రీజినల్‍ వైస్‍ ప్రెసిడెంట్‍ సుమంత్‍ రామ్‍ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :