కొత్తగూడెంలో వికలాంగులకు తానా నిత్యావసరవస్తువుల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో భదాద్రి కొత్తగూడెం జిల్లాలో వికలాంగులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కొత్తగూడెం టౌన్‍లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది వికలాంగులకు సరుకులను ఇచ్చారు. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, శిరీష తూనుగుంట్ల, సుమంత్ రామ్‍సెట్టి, సురేష్ మిట్టపల్లి ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వనమా వెంకటేశ్వరరావు, కంచర్ల చంద్రశేఖర్, వనమా రాఘవేంద్రరావు హాజరయ్యారు. పాండురంగారావు ఈ కార్యక్రమానికి కో ఆర్డినేటర్‍గా వ్యవహరించి కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ తానా తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ, తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరిని, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపుకు ధన్యవాదాలు తెలిపారు.
Tags :