దివ్యజ్యోతి అనాథాశ్రమానికి తానా నిత్యావసర సరకుల విరాళం
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ఆధ్వర్యంలో, శ్రీపాద అనుగ్రహ సేవా ట్రస్ట్ సహకారంతో హైదరాబాద్‍లోని దివ్యజ్యోతి అనాథ ఆశ్రమానికి తానా నిత్యావసర వస్తువులను విరాళంగా అందించింది. కోవిడ్ 19 సంక్షోభ సమయంలో నిత్యావసర సరుకులు లేక ఆశ్రమంలో ఉంటున్న పిల్లలు, ఆశ్రమ నిర్వాహకులు ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన తానా, శ్రీపాద అనుగ్రహ సేవా ట్రస్ట్తో కలిసి బియ్యం, కందిపప్పు, ఇతర సరకులను నెలకు సరిపడేలా ఇచ్చింది. శ్రీనివాస్ ఓరుగంటి ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేశారు. తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్యచౌదరి లావు, జాని నిమ్మలపూడి, సతీష్ మేక, శ్రీచౌదరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించారు. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, కార్యదర్శి రవి పొట్లూరి, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు తదితరులకు, స్పాన్సర్లకు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు ధన్యవాదాలు చెప్పారు.