ASBL Koncept Ambience

కర్నూలులో తానా ఆధ్వర్యంలో 4000 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

కర్నూలులో తానా ఆధ్వర్యంలో 4000 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

కర్నూలులో కోవిడ్‍ 19 సంక్షోభం, లాక్‍డౌన్‍ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు తానా, తానా ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో వివిధ రకాల సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఫిలడెల్ఫియాలో ఉంటున్న తానా కార్యదర్శి రవి పొట్లూరి కర్నూలు నగరంలో నెలన్నరరోజులుగా సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత కరోనా వైరస్‍ నుంచి రక్షణకోసం అందరికీ మాస్క్ లను, శానిటైజర్ లను పంచి పెట్టారు. తరువాత కర్నూలులోని శ్రీ బాలాజీ క్యాంటీన్‍తో కలిసి భోజనపదార్థాల పంపిణీ ప్రారంభించారు. దాదాపు 20,000కు పైగా భోజన పొట్లాలను అందించారు.

తాజాగా తానా ఫౌండేషన్‍ అధ్యక్షుడు నిరంజన్‍ శృంగవరపు సహకారంతో మే 18వ తేదీన కర్నూలు ఓల్డ్ సిటీలో ఉన్న దాదాపు 4,000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‍ఖాన్‍ ఈ వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హఫీజ్‍ఖాన్‍ మాట్లాడుతూ, కోవిడ్‍ 19 కేసులను హ్యాండిల్‍ చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్మోహన్‍ రెడ్డి చూపుతున్న చొరవ ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్‍తోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‍ సహకారం అందించింది.

Click here for Photogallery

Tags :