ASBL Koncept Ambience

పాఠశాల పిల్లల ఆహారం కోసం తానా 1000 డాలర్ల విరాళం

పాఠశాల పిల్లల ఆహారం కోసం తానా 1000 డాలర్ల విరాళం

కోవిడ్‍ 19 కారణంగా పాఠశాలలు మూసివేయడంతో పాఠశాల పిల్లలకు ఆహార కొరత ఏర్పడకుండా వారిని ఆదుకునేందుకు తానా ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా తానా ఫిలడెల్ఫియా టీమ్‍ ఆధ్వర్యంలో ఫీనిక్స్ విల్లే ఏరియా స్కూల్‍ డిస్ట్రిక్ట్ ఫుడ్‍ ప్యాంట్రీ అయిన ఫీనిక్స్ విల్లే కమ్యూనిటీ ఎడ్యుకేషన్‍ ఫౌండేషన్‍కు 1000 డాలర్ల విరాళాన్ని అందించింది. జూన్‍ 15వ తేదీన బార్క్లీ ఎలిమెంటరీ స్కూల్‍ మైదానంలో యువ వలంటీర్ల బృందం ఈ చెక్కును ఫీనిక్స్విల్లే ఏరియా స్కూల్‍ డిస్ట్రిక్ట్ సూపర్‍వైజర్‍ డా. ఫెగ్లీకి అందజేసింది. తానా ఫిలడెల్ఫియా బృందం విద్యార్థుల ఆహారం కోసం గతంలో 2 పాఠశాలలకు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది 3వ పాఠశాల. తానా పాఠశాల పిల్లలకు సహాయం చేయడం పట్ల పలువురు తల్లితండ్రులు, నిర్వాహకులు తానాకు ధన్యవాదాలు చెప్పారు. తానా కార్యదర్శి రవి పొట్లూరి ఆధ్వర్యంలో యువ తానా బృందం సహాయ కార్యక్రమాలను చేపట్టడంపై అందరూ సంతోషం వ్యక్తం చేయడంతో యువవలంటీర్లను అభినందించారు.

Click here for Photogallery

 

Tags :