తానా అట్లాంటా టీమ్ ఆధ్వర్యంలో ఫేస్ షీల్డ్ ల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కోవిడ్ 19 సేవలో విశేష సేవలందిస్తున్న ఫ్రంట్‍లైన్ సిబ్బందికి, డాక్టర్లకు కోవిడ్ 19 నుంచి రక్షణకోసం ఫేస్ షీల్డ్ లను పంపిణీ చేశారు. జార్జియాలో పెద్ద ఆసుపత్రిగా పేరు పొందిన వెల్‍స్టార్ హాస్పిటల్‍లో ఈ సేవా కార్యక్రమాన్ని తానా నిర్వహించింది. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, కిరణ్ గోగినేని, నగేష్ దొడ్డాక, శ్రీరామ్ రొయ్యల, ఇతరుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తానా అట్లాంటా టీమ్ ప్రకటించింది. డాక్టర్ నందిని సుకిరెడ్డి ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేశారని కూడా వారు తెలిపారు.
Tags :