విజయవాడలో కొనసాగుతున్న తానా - వెంకట్ కోగంటి అన్నదానం
కోవిడ్ 19 సంక్షోభ వేళలో నిరుపేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతోమంది తానా నాయకులు తెలుగు రాష్ట్రాల్లో తమ సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. బే ఏరియాలో ఉంటున్న తానా జాయింట్ ట్రెజరర్ వెంకట్ కోగంటి విజయవాడలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదటిరోజు ,2వ రోజు, 3వ రోజున కూడా విజయవాడ ధర్నాచౌక్ వద్ద అమృత హస్తం సహకారంతో అన్నదానం కార్యక్రమం చేశారు. వెంకట్ కోగంటి మాట్లాడుతూ ఈ కార్యమ్రాన్ని 10రోజుల వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, వైస్ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు తదితరులకు వెంకట్ కోగంటి ధన్యవాదాలు తెలిపారు.
Tags :