ASBL Koncept Ambience

కొత్తగూడెంలో తానా అన్నదానం

కొత్తగూడెంలో తానా అన్నదానం

కోవిడ్‍ 19 సంక్షోభ సమయంలో ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని ఆదుకునేందుకు తానా ముందుకు వచ్చింది. తెలంగాణలోని కొత్తగూడెంలో ఉన్న అమ్మ అనాథ శరణాలయంలో తానా ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా న్యూయార్క్ రీజినల్‍ వైస్‍ ప్రెసిడెంట్‍ సుమంత్‍రామ్‍ ఈ అన్నదానం కార్యక్రమాన్ని స్పాన్సర్‍ చేశారు. తానా న్యూజెర్సి రీజినల్‍ వైస్‍ ప్రెసిడెంట్‍ రాజా కసుకుర్తి కూడా ఈ అనాథాశ్రమంలో అన్నదానం చేశారు. తానా అధ్యక్షులు జయ్‍ తాళ్ళూరి, ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు, సతీష్‍ వేమన, రవి పొట్లూరి, రవి మందలపు, తూనుగుంట్ల శిరీష, రాజా కసుకుర్తి తదితరుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సుమంత్‍రామ్‍, రాజా కసుకుర్తి తెలిపారు.

Click here for Event Gallery

Tags :