మారుమూల అటవీ ప్రాంతాల్లో తానా అన్నదానం
1500 మంది గిరిజనులకు అన్నం పెట్టిన తానా ఫౌండేషన్
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన సహాయ సహకారములతో ప్రకాశం జిల్లా, శ్రీశైలం మారుమూల అటవీ ప్రాంతంలోని మర్రిపాలెం, చింతల గిరిజన గ్రామాల్లో ఉన్న 1500 మంది ప్రజలకి అన్నదానం చేశారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో లాక్ డౌన్ వలన పనులు లేక, ఆహారానికి ఇబ్బందులు పడుతున్న తమను గుర్తించి సరైన రవాణా సౌకర్యాలు లేకున్నను, అతి కష్టంగా మా ప్రాంతాలకు చేరుకుని, ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చిన తానా ఫౌండేషన్ కు, సహకరించిన సతీష్ వేమనకి, జయ్ తాళ్లూరికి, నిరంజన్ శృంగవరపు, ఇస్కాన్ సంస్థ వారికి గిరిజన ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
తానా ఫౌండేషన్(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ద్వారా అమెరికాలో స్థిరపడిన తెలుగు వారు తమ సహాయ సహకారాలతో భారతదేశ వ్యాప్తంగా పలు చోట్ల తమ దాతృత్యం ద్వారా జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారని తానా నుండి సహాయం పొందిన వారు అభినందించారు.