ASBL Koncept Ambience

నాష్‍ విల్లేలో తానా టీమ్ సహాయ కార్యక్రమాలు

నాష్‍ విల్లేలో తానా టీమ్ సహాయ కార్యక్రమాలు

కోవిడ్‍ 19 పేషంట్లకు సేవలను అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ, నాష్‍విల్లే తానా టీమ్‍ వారికి లంచ్‍ ఏర్పాటు చేసింది. మౌంట్‍ జూలియట్‍ పోలీస్‍ డిపార్ట్మెంట్‍, మెడికల్‍ సెంటర్‍ డేవిడ్‍సన్‍ కౌంటీ సిబ్బందికి లంచ్‍ను తానా టీమ్‍ అందించింది. సిటీ కో ఆర్డినేటర్‍ రామకృష్ణ కిలారుతోపాటు వలంటీర్లు ఉదయ్‍ కందుల, అనిల్‍ భీమవరపు, రాజ్‍ రంగ, ప్రవీణ్‍ మద్దిపట్ల, తాండవ్‍ వల్లేపల్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొలంబియా సిటీ కో ఆర్డినేటర్‍ నజర్‍ సయ్యద్‍ కూడా జాబ్‍లు కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తానా ప్రెసిడెంట్‍ జయ్‍ తాళ్ళూరి, పాస్ట్ ప్రెసిడెంట్‍ సతీష్‍ వేమన, ఇవిపి అంజయ్య చౌదరిలావు, సెక్రటరీ రవి పొట్లూరి తదితరుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు.

Tags :