ASBL Koncept Ambience

వెంకట్‍ కోగంటి ఆధ్వర్యంలో విజయవాడలో అన్నదాన కార్యక్రమం

వెంకట్‍ కోగంటి ఆధ్వర్యంలో విజయవాడలో అన్నదాన కార్యక్రమం

కోవిడ్‍ 19 బాధితులను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‍ ముందుకు వచ్చింది. అమెరికాలో ఉంటున్న తానా నాయకులు ఎందరో తమ తమ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. బే ఏరియాలో ఉంటున్న తానా జాయింట్‍ ట్రెజరర్‍ వెంకట్‍ కోగంటి విజయవాడలో అన్నదాన కార్యక్రమాన్ని స్పాన్సర్‍ చేశారు. దాదాపు 1000 మందికి విజయవాడ అన్న క్యాంటీన్‍, అలంకార్‍ సెంటర్‍, రైల్వే స్టేష్‍న్‍ వద్ద తానా ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పాత ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న వలస కూలీల కుటుంబాలకు, బందర్‍ రోడ్డులో ఉన్న వలసకూలీల కుటుంబాలకు అన్నదానం చేశారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, సతీష్‍ వేమన, వైస్‍ ప్రెసిడెంట్‍ అంజయ్య చౌదరి లావు, రవి పొట్లూరి తదితరులకు వెంకట్‍ కోగంటి ధన్యవాదాలు తెలిపారు. అమృతహస్తం ఛారిటబుల్‍ ట్రస్ట్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Click here for Event Gallery

Tags :