ASBL Koncept Ambience

నందిగామలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన తానా

నందిగామలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన తానా

ఆంధప్రదేశ్‍లో కరోనా సేవల్లో భాగంగా కృష్ణాజిల్లాలోని నందిగామలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని తానా నిర్వహించింది. ఈ సందర్భంగా దాదాపు 1650 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు. తానా 5కె నేషనల్‍ కో ఆర్డినేటర్‍ వంశీ వాసిరెడ్డి ఈ కార్యక్రమానికి అవసరమైన విరాళాన్ని అందించారు.

విజయవాడ ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి నిత్యావసర వస్తులిచ్చిన తానా

కరోనా పేషంట్ల చికిత్సలో ముందుంటున్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి నిత్యావసర వస్తువులను, మాస్క్లను పంపిణీ చేశారు. సురేష్‍, గోపాల్‍ శీలమనేని ఈ కార్యక్రమానికి విరాళాలను ఇచ్చారని, వారికి తానా తరపున ధన్యవాదాలు చెప్పారు.

విశాఖపట్నంలో గ్యాస్‍లీకేజి బాధితులకు తానా చేయూత

విశాఖపట్టణంలో ఎల్‍జి పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన  గ్యాస్‍ లీకేజి కారణంగా ఇబ్బందిపడిన బాధితులను ఆదుకునేందుకు తానా ముందుకు వచ్చింది. తానా తరపున పలువురు బాధితులకు నిత్యావసర వస్తువులను ఇటీవల పంపిణీ చేశారు. ఎబిఎన్‍ టీమ్‍, ఇతర వలంటీర్ల సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తానా తెలిపింది.

 

Tags :