మిసిసిఫిలో వైద్యసిబ్బందికి తానా సత్కారం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిసిసిఫి విభాగం ఆధ్వర్యంలో కోవిడ్ 19 పేషంట్లకు అత్యున్నతమైన సేవలను అందిస్తున్న ఫ్రంట్‍లైన్ సిబ్బందిని అభినందిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బాప్టిస్ట్ మెడికల్ హాస్పిటల్ సిబ్బంది చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ లంచ్‍ను ఇచ్చారు. డాక్టర్ సుధీర్ రెడ్డి తంగెళ్ళ, డాక్టర్ అజయ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మిసిసిఫి విభాగం తానా నాయకుడు శశాంక్ యార్లగడ్డ తెలిపారు. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, సతీష్ వేమన, అంజయ్య చౌదరి లావు, రవి పొట్లూరి, నిరంజన్ శృంగవరపు, కిరణ్ గోగినేని సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు.
Tags :