తానా హారీస్‍బర్గ్ టీమ్ ఆధ్వర్యంలో హాస్పిటల్ సిబ్బందికి లంచ్
తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ ఆధ్వర్యంలో తానా హారీస్‍బర్గ్ టీమ్ కోవిడ్ 19 పేషంట్లకు సేవలందిస్తున్న యుపిఎంసి పినకల్ హెల్త్ హాస్పిటల్ సిబ్బందికి లంచ్ ఇచ్చింది. పేషంట్లకు వారు చేస్తున్న చికిత్సను ప్రశంసిస్తూ, ఈ లంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తానా నాయకులు పేర్కొన్నారు. పరివార్ ఇండియన్ రెస్టారెంట్ నుంచి తెచ్చిన లంచ్ ప్యాకెట్లను హాస్పిటల్ సిబ్బందికి పంపిణీ చేశారు. తానా లైఫ్ మెంబర్ వెంకటరావు, ప్రవీణ నెల్లూరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించారని వారికి తానా నాయకులు ధన్యవాదాలు చెప్పారు.
తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, తానా బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ, మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, ఇవిపి అంజయ్యచౌదరి లావు, సెక్రటరీ రవి పొట్లూరి, ఫౌండేషన్ సెక్రటరీ రవి మందలపు మద్దతుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తానా మిడ్ అట్లాంటిక్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ చుండ్రు తెలిపారు. సాంబశివ అంచ, వెంకటేశ్వరరావు సింగు, నెల్లూరి వెంకటరావు, శశిధర్ జాస్తి, వెంకట యార్లగడ్డ, వెంకట సుబ్బారావు ముప్ప, సందీప్, శ్రీనివాస్ కోట, రాజు గుండాల, వేణు మక్కెన, వెంకట్ గోపీనాథ్ చిమ్మిలి, రాంబాబు కావూరి, నవీన్ తోకల, సాంబశివ నిమ్మగడ్డ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.