తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లాలో మాస్క్ లు, నిత్యావసర సరకుల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా భద్రయ్య నగర్‍లో తానా అధ్యక్షుడు జయ్ తాళ్లూరి, తానా ఫౌండేషన్ చైర్మన్ శృంగవరపు నిరంజన్, తానా ట్రస్టీ పుట్టగుంట సురేష్ సహకారంతో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చేతుల మీదుగా 1000 మాస్క్ లతో పాటు లక్ష రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ మాస్కులలో 400 వైద్య సిబ్బందికి, 300 పోలీసులకు, 300 పారిశుద్ధ్య సిబ్బందికి అందచేశారు. ఈ కార్యక్రమంలో గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, పుట్టగుంట రమేష్, డా.వాసిరెడ్డి అరుణ, మనిదర్ యలమంచలి తదితరులు పాల్గొన్నారు.
Tags :