ASBL Koncept Ambience

తానా సహకారంతో కర్నూల్‍ లో వెయ్యి మందికి మాస్కుల పంపిణీ

తానా సహకారంతో కర్నూల్‍ లో వెయ్యి మందికి మాస్కుల పంపిణీ

కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ప్రధానమైనది మాస్కులు ధరించడం, మాస్కులు ధరించడం ద్వారా కరోనా వైరస్‍ రాకుండా చాలా వరకు కట్టడి చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో మాస్క్ల పంపిణీకి ఫిలడెల్ఫియాలో ఉన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శి రవి పొట్లూరి ముందుకు వచ్చారు.

రవి పొట్లూరి సహకారంతో శనివారం (ఏప్రిల్‍ 11)నాడు కర్నూలు పట్టణ కమిషనర్‍ రవీంద్ర బాబు చేతుల మీదుగా కర్నూల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ లో ఉద్యోగులకు వెయ్యి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్‍, సీఐ డేగల ప్రభాకర్‍ పాల్గొన్నారు. బాలాజీ కాంటీన్స్ ద్వారా మార్చి 31 నుండి ప్రతి రోజు వెయ్యిమందికి పైగా పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు ఆహారం అందజేస్తున్నామని, తానా అధ్యక్షులు తాళ్లూరి జయ్‍ శేఖర్‍, మాజీ అధ్యక్షులు సతీష్‍ వేమన, ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృoగవరపు సహకారంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా మాస్కుల పంపిణీ జరుగుతుందని ముప్పా రాజశేఖర్‍ తెలిపారు.

Click here for Photogallery

 

Tags :