ASBL Koncept Ambience

రాజమండ్రిలో తానా మాస్క్ ల పంపిణీ

రాజమండ్రిలో తానా మాస్క్ ల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాధి ఇతరులకు విస్తరించకుండా అవసరమైన మాస్క్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తానా ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో మిడ్‍ అట్లాంటిక్‍ తానా రీజినల్‍ వైస్‍ ప్రెసిడెంట్‍ సతీష్‍ చుండ్రు సౌజన్యంతో పోలీసులకు మాస్కులను పంపిణీ చేశారు. గుడా ప్రధమ చైర్మన్‍ గన్ని కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్‍ మాజీ డైరెక్టర్‍ కాశి నవీన్‍ కుమార్‍, నగర తెదేపా ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య, తేతలి రామారెడ్డి పోలీసులకు మాస్క్లను ఇవ్వాల్సిందిగా ట్రాఫిక్‍ డిఎస్పీ ఎస్‍.వెంకట్రావు, సెంట్రల్‍ జోన్‍ డిఎస్పీ సంతోష్‍ కుమార్‍ లకు అందజేశారు. అమెరికాలో ఉద్యోగ నిమిత్తం ఉన్నా స్వస్థలంలో జరుగుతున్న పరిస్థితులపై స్పందించి మాస్కులు సమకూర్చిన తానా అధ్యక్షులు జయ్‍ తాళ్ళూరి, వ్యవస్థాపక అధ్యక్షులు నిరంజన్‍ శ•ంగవరపు, కార్యదర్శులు రవి పొట్లూరి, రవి సామినేని, చుండ్రు సతీష్‍లకు ఈ సందర్భంగా సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

 

Tags :