తానా ఎన్నికల నోటిఫికేషన్ 31న విడుదల
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీలో తామున్నామంటూ నిరంజన్ శృంగవరపు, నరేన్ కొడాలి, శ్రీనివాస గోగినేని బహిరంగంగా ప్రకటించారు. తానా బోర్డ్ శుక్రవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో ఎన్నికల తేదీలను ఖరారు చేశారు. జనవరి 31వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 14 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 22 వరకు జరుగుతుంది. మార్చి 15 నుండి బ్యాలెట్ పేపర్ల పోస్టల్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మే14 వరకు పోస్టల్ బ్యాలెట్ల స్వీకరణ నిర్వహించి, మే 15, 16 తేదీల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మే16న నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తారని సమాచారం.
Tags :