తానా ఎన్నికల్లో ఏకగ్రీవాలు...పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)ఎన్నికల్లో పలు పదవులకు పోటీ లేకుండా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరికొన్ని పదవులకు పోటీ తప్పనసరి అయింది. ఈసారి ఎన్నికల్లో ప్రెసిడెంట్ ఎలక్ట్ పదవి నుంచి పలు పదవులకు పోటీ తప్పనిసరి అయింది.
తానా ట్రెజరర్ పదవికి రవి పొట్లూరి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీ పదవికి శ్రీకాంత్ దొడ్డపనేని నామినేషన్ ఒక్కటే దాఖలైంది. దాంతో ఆ పదవి కూడా ఏకగ్రీవమైనట్లే. ఇక డోనర్ క్యాటగిరి నుంచి డోనర్ పదవికి హరీష్ కోయ ఒక్కరే నామినేషన్ వేశారు. ఫౌండేషన్ ట్రస్టీ - డోనర్ క్యాటగిరి పదవులకు శ్రీనివాసరావు మండవ, శశికాంత్ వల్లిపల్లి, ఫౌండేషన్ ట్రస్టీ - నాన్ డోనర్ క్యాటగిరి పదవులకు శివరామ్ యార్లగడ్డ, నిరంజన్ శృంగవరపు, రవి మందలపు, హేమచంద్ర శేఖర్ కానూరు, కల్చరల్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ పదవికి రాజేష్ అడుసుమిల్లి, కౌన్సిలర్ అట్ లార్జ్ పదవికి వినోజ్ చనుమోలు, ఉమెన్స్ సర్వీస్ కో ఆర్డినేటర్ పదవికి లక్ష్మీదేవినేని, రీజినల్ కో ఆర్డినేటర్ - మిడ్ వెస్ట్ పదవికి హరీష్ కొలసాని, రీజినల్ కో ఆర్డినేటర్ న్యూఇంగ్లాండ్ పదవికి విశ్వనాథ్ నాయునిపాటి, శ్రీనివాస్ ఎండూరి, రీజినల్ కో ఆర్డినేటర్ - న్యూయార్క్ పదవికి విద్యా గారపాటి, రీజినల్ కో ఆర్డినేటర్ - నార్త్ పదవికి సునీల్ పాంత్రా, రీజినల్ కో ఆర్డినేటర్ - నార్త్ సెంట్రల్ పదవికి రాజేంద్ర ప్రసాద్ లోసెట్టి, రీజినల్ కో ఆర్డినేటర్ - నార్త్‌వెస్ట్ పదవికి చంద్రిక నిమ్మగడ్డ, రీజినల్ కో ఆర్డినేటర్ - వెస్ట్ పదవికి మధు రావెళ్ళ, రీజినల్ కో ఆర్డినేటర్ -కెనడా పదవికి లక్ష్మీ నారాయణ సూరపనేని, రీజినల్ కో ఆర్డినేటర్ - కేపిటల్ పదవికి రఘు దీప్ మేక, రీజినల్ కో ఆర్డినేటర్ - రాకీ మౌంటెన్ పదవికి విజయ్ కొమ్మినేని, రీజినల్ కో ఆర్డినేటర్ - సౌత్ సెంట్రల్ పదవికి శేషుబాబు ఎంటూరి నామినేషన్‌లు వేశారు. వీరికి పోటీగా నామినేషన్‌లు ఎవరూ వేయకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైన జాబితాలో ఉన్నారు.
కొన్ని పదవులకు పోటీ తీవ్రం
తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ పదవికి జే తాళ్ళూరితోపాటు శ్రీనివాస గోగినేని కూడా పోటీ పడుతున్నారు. డైరెక్టర్ - నాన్ డోనర్ పోస్టులకోసం నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, జగదీష్ ప్రబల, రవి సామినేని, వెంకట రమణ యార్లగడ్డ, సెక్రటరీ పదవికోసం భక్త బల్లా, అంజయ్య చౌదరి లావు, జాయింట్ ట్రెజరర్ పోస్టుకు అశోక్ బాబు కొల్లా, రావు యలమంచిలి, కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ పదవికి మురళీ తాళ్ళూరి, సతీష్ వేమూరి పోటీ పడుతున్నారు. రీజినల్ కో ఆర్డినేటర్ - అప్పలచియాన్ పోస్టుకు కుమార్ ఎ నెప్పల్లి, మల్లిఖార్జున వేమన, రీజినల్ కో ఆర్డినేటర్ - మిడ్ అట్లాంటిక్ పోస్టుకు నాగరాజు నలజుల, రఘు ఎద్దులపల్లి, రీజినల్ కో ఆర్డినేటర్ - ఒహాయో వ్యాలీ పదవికి శ్రీనివాస్ సంగ, శ్రీని యలవర్తి, రీజినల్ కో ఆర్డినేటర్ - సౌత్‌ఈస్ట్ పదవికి కిరణ్ గోగినేని, భరత్ మద్దినేని, వినయ్ మద్దినేని, రీజినల్ కో ఆర్డినేటర్ - సౌత్ వెస్ట్ పదవికి ప్రశాంత్ చాగర్లమూడి, సుగన్ చాగర్లమూడి, లోకేష్ కొణిదెల, దినేష్ త్రిపురనేని పోటీ పడుతున్నారు.