ASBL Koncept Ambience

తానా ఎన్నికల వేడి... ఆన్‌లైన్‌ ఓటింగ్‌

తానా ఎన్నికల వేడి... ఆన్‌లైన్‌ ఓటింగ్‌

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కార్యవర్గానికి, బోర్డ్‌ డైరెక్టర్‌, ఫౌండేషన్‌ ట్రస్టీ, రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఎన్నికల కమిటీ చైర్మన్‌ కనకంబాబు ఐనంపూడి ఈ మేరకు ప్రకటనను వెలువరించారు. నామినేషన్ల దాఖలుకు తుది గడువు నవంబర్‌ 16,2023, నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకునే గడువు నవంబర్‌ 30, ఫైనల్‌ నామినేషన్‌ ప్రకటన డిసెంబర్‌ 3న, బ్యాలెట్‌ కౌంటింగ్‌ జనవరి 13, ఫలితాల ప్రకటన జనవరి 14న ఉంటుందని ఎన్నికల కమిటీ ఈ ప్రకటనలో తెలియజేసింది. 

ఇప్పుడు జరగబోతున్న తానా ఎన్నికల్లో ఇరు వర్గాలు మళ్లీ తమ తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి, ఇతర కొన్ని పదవులకు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. క్రిందటిసారి అధ్యక్ష పదవికి బరిలో వున్న డా. నరేన్‌ కొడాలి ఒక వైపు, రెండోవైపు ఇంతకు ముందు సెక్రెటరీగా చేసిన సతీష్‌ వేమూరి ఉన్నారని తెలుస్తోంది. 15 మంది సభ్యులు కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి ఆన్‌లైన్‌్‌ బాలట్‌ ప్రక్రియను కూడా ఖరారు చేసింది. నవంబర్‌ 16లోగా కొత్త నామినేషన్ల పంపడానికి ఉన్న గడువుతో ఎన్నికల వేడి ఇప్పుడే కనిపిస్తోంది. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా ప్రచారపర్వాన్ని కొంతమంది ఇప్పటికే ప్రారంభించారు. ఈసారి ఎన్నికల్లో ఓటింగ్‌ ప్రక్రియను మార్చారు. ఆన్‌లైన్‌ ద్వారా ఓటింగ్‌ వేసే ప్రక్రియకు నాంది పలికారు. మొదటిసారిగా ప్రవేశపెట్టడంతో ఈ ప్రక్రియ ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.

 

 

Tags :