సిఎలో విజయవంతమైన తానా ఫైనాన్షియల్ సెమినార్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సదరన్ కాలిఫోర్నియా రీజియన్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ సెమినార్‍ను విజయవంతంగా నిర్వహించింది. పీస్‍పుల్ అడ్వయిజర్స్కు చెందిన ఫైనాన్షియల్ నిపుణుడు శ్రీకాంత్ మోపర్తి కార్యక్రమానికి వచ్చినవారు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. దానికితోడు ఇన్వెస్ట్మెంట్స్, రిటైర్‍మెంట్, ఐఆర్‍ఎ, స్టూడెంట్ ఎడ్యుకేషన్ వంటి విషయాలపై ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 23వ తేదీన కాలిఫోర్నియాలోని తాండూరులో జరిగిన ఈ సెమినార్‍కు ఎంతోమంది హాజరయ్యారు. తానా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ కండెపు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్టాక్స్, ఫండ్స్కు సంబంధించిన విషయాలను కూడా ప్రభు మొగుళ్ళ తెలిపారు. ఆరెంజ్ కౌంటీ ఏరియాలో ఉన్న పలువురు దాదాపు 60మంది ఈ సెమినార్‍కు హాజరయ్యారు.
Tags :