ఫ్రీమాంట్‌లో తానా ఫుడ్ డ్రైవ్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అనాథ శరణాలయాలకు, పేదలకు ఆహారపంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫ్రీమాంట్‌లో ఉన్న అబోడ్ సర్వీసెస్ హోమ్ లెస్ షెల్టర్‌లో ఉన్న పేదలకు తానా వెస్ట్ టీమ్, ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో దాదాపు 5,000 డాలర్ల విలువకల ఫుడ్ ఐటెమ్స్‌ను అందజేశారు. తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మల్లివేమన సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తానా నాయకులు పేర్కొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు జయరామ్ కోమటి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సతీష్ వేమూరి, భక్తబల్లా, వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్ల తదితరులు ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందించారు. భరత్ ముప్పిరాల, శ్రీకాంత్ బొల్లినేని, ఎంవి రావు, లక్ష్మీకాంత్ గాదిరాజు, వీరు ఉప్పల, యశ్వంత్ కుదరవల్లి, రామ్ తోట తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణ గొంప, గోకుల్ రాచిరాజు, మురళి ఆలపాటి, శ్రీకాంత్ దొడ్డపనేని, మైక్ బండ్ల, శ్రీనివాస్ వల్లూరుపల్లి, భాస్కర్ వల్లభనేని, జితేంద్ర కొత్తపల్లి, వెంకట్ కోడూరు, కరుణ్ వెలిగేటి, హరిగక్కని తదితరులు కూడా ఈ కార్యక్రమం విజయవంతానికి సహాయపడ్డారు.