పేదలకు తానా సేవలందించడం ప్రశంసనీయం - తాళ్ళూరి పంచాక్షరయ్య, కోనేరు సత్యనారాయణ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ 19 కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. పాల్వంచలో జరిగిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో దాదాపు 300 మంది కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. యడ్లపల్లి శ్రీనివాస కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా తాళ్లూరి పంచాక్షరయ్య, కోనేరు ట్రస్ట్ వ్యవస్థాపకులు కోనేరు సత్యనారాయణ, సిఐ నవీన్ కుమార్, తాళ్లూరి ట్రస్ట్ డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ, బిక్కసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags :