ASBL Koncept Ambience

గ్రామాల్లో తానా ఫౌండేషన్ వైద్యసేవలు

గ్రామాల్లో తానా ఫౌండేషన్ వైద్యసేవలు

ఏపీ, తెలంగాణా రాష్త్రాల్లో ఉన్న గ్రామాల్లో తానా ఫౌండేషన్‌ తరపున వైద్యసేవలను అందిస్తున్నట్లు  తానా ఫౌండేషన్‌ అధ్యక్షుడు శంగవరపు నిరంజన్‌ తెలిపారు. చిన్నారులకు విద్యా, పెద్దలకు వైద్య సదుపాయలు, సేవలపై ద ష్టి సారించనున్నట్లు చెప్పారు. భారత్‌ బయోటెక్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో హెపటైటిస్‌ బీ, టైఫాయిడ్‌ వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆ సంస్థ సీఈఓ ఎల్లా కష్ణతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నిరంజన్‌తోపాటు కోయా హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :